కక్షసాధింపు ధోరణి వీడి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై సీఎం జగన్ సీబీఐ ఎంక్వైరీ కోరి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. మద్యం, ఇసుక మాఫియాని ప్రొత్సహిస్తూ.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ ఎందుకు వేయించుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
' పాఠ్య పుస్తకాలపై సీఎం ఎందుకు బొమ్మవేయించుకున్నారు' - devineni uma on tdp
పాఠ్య పుస్తకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ ఎందుకు వేయించుకున్నారో సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సీఎం జగన్.. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కోరి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
వైకాపా ప్రభుత్వ పాలనపై దేవినేని ఉమా
రివర్స్ టెండర్ల పేరుతో తమ బంధువులకు పనులను అప్పగించడం తప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులున్నా పద్దు భారీగానే.. 2.60 లక్షల కోట్లు..!