ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Devineni Uma House Arrest: వరుసగా రెండో రోజు దేవినేని ఉమా గృహ నిర్బంధం - ap latest news

Devineni uma house arrest: కృష్ణా జిల్లా మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలని డిమాండ్​ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్​ చేపట్టారు. బంద్​లో పాల్గొనేందుకు వెళ్తున్న తెదేపా నేత దేవినేని ఉమాను.. రెండో రోజు పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Devineni uma house arrest
వరుసగా రెండో రోజు దేవినేని ఉమా హౌజ్ అరెస్టు

By

Published : Mar 9, 2022, 11:32 AM IST

వరుసగా రెండో రోజు దేవినేని ఉమా హౌజ్ అరెస్టు

Devineni uma house arrest: కృష్ణా జిల్లా మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ జి.కొండూరులో చేపట్టిన బంద్‌కు వెళ్లకుండా.. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వరుసగా రెండో రోజూ ఆయన్ను హౌస్ అరెస్ట్‌ చేశారు.

మంగళవారం మైలవరంలో తలపెట్టిన బంద్‌కు కూడా దేవినేని ఉమా వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇవాళ గొల్లపూడిలోని ఆయన ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. జి.కొండూరు బంద్‌కు.. మైలవరం రెవెన్యూ డివిజన్ పోరాట సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బంద్‌ను విజయవంతం చేస్తామని.. సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details