పర్యావరణాన్ని, తీరప్రాంతాన్ని తుపానుల నుంచి కాపాడుతున్న 'మడ' అడవులను కాకినాడలో కొట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా విచారం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న పర్యావరణ విధ్వంసం నుంచి కోర్టులు కాపాడుతున్నాయన్నారు. మడ అడవులు మాయం చేస్తున్న బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘సీఎం గారూ.. మడ అడవులు మాయం చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారు’
మడ అడవులు మాయం చేస్తున్న బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న పర్యావరణ విధ్వంసం నుంచి కోర్టులు కాపాడుతున్నాయని ఆయన అన్నారు.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన 66 ఏళ్ళ రంగనాయకమ్మపై అక్రమంగా కేసు పెట్టారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ వాళ్లని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. పోస్టు పెడితేనే 5 ఏళ్ల జైలు శిక్ష, 10లక్షల జరిమానా వేస్తారా? అంటూ నిలదీశారు. ఆమెపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి.. గత ఐదేళ్లలో వైకాపా పెట్టిన పోస్టులకు ఎన్నికేసులు పెట్టాలో ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : కరోనా వైరస్ మన దుస్తులకు అంటుకుంటుందా?