పాలన చేతగాక సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ విమర్శించారు. కృష్ణా జిల్లా పురగుట్టలో తెదేపా హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని దేవినేని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన లే అవుట్‌కు వైకాపా పేర్లు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతుల సమస్య తీర్చమని వచ్చిన వారిపై నాయకులతో దాడి చేయించడం దారుణమన్నారు. రైతులపై దాడులు చేయడమే.. రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు. కడప జిల్లాలో సుబ్బయ్య హత్య సర్కర్ హత్యేనని ఆరోపించారు. సుబ్బయ్య హత్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'సీఎం... పాలన చేతగాక క్షమాపణ చెప్తారు' - ప్రొద్దుటూరులో తెదేపా నేత హత్య అప్డేట్స్
తెదేపా ప్రభత హయాంలో ఏర్పడిన లే అవుట్‌కు వైకాపా పేర్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలన చేతగాక ప్రజలకు క్షమాపణ చెప్పారని ఆరోపించారు.
!['సీఎం... పాలన చేతగాక క్షమాపణ చెప్తారు' devineni uma fires on ysrcp government on house lands to poor issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10056161-615-10056161-1609314207735.jpg)
దేవినేని ఉమ