కరోనా వైరస్ కన్నా కుల వైరస్ అనే పెద్ద జబ్బు రాష్ట్రంలో నడుస్తోందన్న నటుల వ్యాఖ్యలు వాస్తవమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. సినీ నటుడు రామ్ ట్వీట్ చేస్తే, పోలీసులు అతడిని బెదిరించడమేంటని నిలదీశారు. వైద్యులను, వారి కుటుంబసభ్యులను, బంధువులను, పెట్టుబడిదారులను, అందరినీ బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తుంటే, ఇక్కడున్న ఆసుపత్రుల్ని ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో మూసి వేయిస్తోందని దేవినేని ఆరోపించారు.
విచారణ పేరుతో పోలీసుల వీరంగం
డాక్టర్ రమేశ్బాబుగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి, ప్రభుత్వానికి మాత్రం రమేశ్ చౌదరిగా కనిపించారని విమర్శించారు. రాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లోని రమేశ్ ఇంటికి వెళ్లి, 86ఏళ్ల వృద్ధురాలిపై విచారణ పేరుతో వీరంగం చేశారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి వైద్యం చేశారని రమేశ్‌బాబుపై ప్రభుత్వం కక్ష కట్టిందా లేక ఆయన చంద్రబాబునాయుడితో కోవిడ్‌పై మాట్లాడారని కక్ష సాధింపులకు పాల్పడుతుందా అని నిలదీశారు.
స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించినప్పుడు, అందులో ఫైర్, ఇతరేతర వసతులున్నాయో లేదో తెలియదా అని ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనలో అసలు కుట్రదారులెవరో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఆ గ్రామాలకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!