గతంలో పంచాయతీ కార్యాలయాలకు ఉన్న రంగులను మార్చేందుకు ఇప్పుడు 13 వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుపెట్టిందని... మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోడ్ నిబంధనల కారణంగా మళ్లీ రంగులు మార్చేందుకు మరో 13వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అమరావతిలో వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజాధనాన్ని ప్రభుత్వ ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రభుత్వ అసమర్థత బట్టబయలైందని విమర్శించారు. నిరంతరాయంగా విద్యుత్‌ను తమ ప్రభుత్వం అందిస్తే... ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పడు పోతుందో తెలియని దుస్థితి ఈ నాలుగునెలల్లో ప్రజలకు కల్పించారని దేవినేని దుయ్యబట్టారు.
''రూ.1300 కోట్లతో పంచాయతీ కార్యాలయాలకు రంగులేస్తారా?" - devineni uma fires on panchayat building colours
పంచాయతీ కార్యాలయాల రంగుల మార్పునకు 13 వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు