రాష్ట్రంలో తెదేపాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినా సీఎం అభద్రతా భావనలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. తెదేపా నేతలను భయపెట్టి వైకాపాలోకి చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇసుక దీక్షకు ప్రభుత్వం భయపడిందన్నారు. సిమెంట్ కుంభకోణం బయట పడుతుందనే ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
'151 మంది ఎమ్మెల్యేలున్నా... అభద్రతా భావం' - devineni uma comments on jagan
సీఎం జగన్కు 151 మంది ఎమ్మెల్యేలున్నా అభద్రతా భావన ఉందని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. తెదేపా నేతలను భయపెట్టి వైకాపాలోకి చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.
జగన్పై దేవినేని వ్యాఖ్యలు