రాష్ట్ర ప్రజల్ని ఉగాది పండుగ చేసుకోనీయకుండా జగన్ వారి జీవితాల్లో చీకట్లు నింపారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. కొత్త సంవత్సరం రోజున ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాల్సిన వేళ ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని కల్పించారన్నారు. విద్యుత్ ధరల పెంపును నిరసిస్తూ.. కృష్ణా జిల్లా తుమ్మలపాలెంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఉమా పాల్గొన్నారు. కోతలు, వాతలతో సీఎం జగన్ ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో మళ్లీ లాంతర్లు, కిరోసిన్ బుడ్డీలు వెతుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ఒక్కసారీ కరెంట్ ఛార్జీలు పెంచలేదని, ఒక్క గంట కరెంట్ తీయ్యలేదని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తెదేపా పోరాటం చేస్తుందన్నారు.
కోతలు, వాతలతో ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారు: దేవినేని - దేవినేని తాజా వార్తలు
కోతలు, వాతలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కొత్త సంవత్సరం రోజున ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాల్సిన వేళ ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితిని కల్పించారన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తెదేపా పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కోతలు, వాతలతో ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారు