ప్రభుత్వ వైఫల్యంతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తివేస్తోందని విమర్శించారు. ఫలితంగా సామాన్యుల జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుబజార్లను సందర్శిస్తామని చెప్పారు. ప్రజల ఇబ్బందుల పట్ల ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ధరల పెరుగుదలతో ప్రజల జీవనం అస్తవ్యస్తం: దేవినేని - నిత్యావసర ధరలపై దేవినేని ఆగ్రహం
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తివేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రభుత్వ తీరుతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.
Devineni_Uma