పోలవరం మా జీవనాడి
ప్రాణనాడి, జీవనాడి అయిన పోలవరంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధానిగా 5ఏళ్ల కాలంలో ఒక్కసారైనా పోలవరం సందర్శనకు మోదీ రాలేదన్నారు. 2019 జులైనాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారనీ.. వారి నమ్మకాన్ని దెబ్బతీసేలామాట్లాడడం తగదని హితవు పలికారు. పోలవరం ఏటీఎం కాదనీ... నర్మదా ప్రాజెక్టు మోదీకి ఏటీఎంగా ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. నర్మదా ప్రాజెక్టులో అవినీతి, అంచనాలు పెంచిఏటీఎంలా ఉపయోగించుకున్నారనిఆరోపించారు.
తెరాసతో కలిసి జగన్ కుట్రలు
పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెరాస నేతలు కేసులు వేశారని దేవినేని గుర్తుచేశారు.కేసీఆర్‌తో తగ్గి ఉంటేనే కృష్ణా జలాలు వస్తాయని జగన్ అనడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న తెరాస నేతలకు జగన్ మద్దతుగా ఉన్నారనీ.. దీనిపై రాయలసీమ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్, వైకాపా నేతలు మినహా లక్షలమంది పోలవరం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. జగన్... కేసీఆర్‌తో చేతులు కలిపి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు.