ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నవమాసాల పాలనను నవ'మోసాలు'గా మార్చారు' - devineni uma comments news on jagan news

ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నవమాసాల పాలనను నవ'మోసాలు'గా మార్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని ఆయన విమర్శించారు.

devineni uma comments ysrcp govt
devineni uma comments ysrcp govt

By

Published : Feb 20, 2020, 7:53 PM IST

'నవమాసాల పాలనను నవ'మోసాలు'గా మార్చారు'

పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన 18వందల కోట్ల నిధులను లిక్కర్ కంపెనీల్లో జగనన్న పెట్టాడంటూ దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బోసుబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో దేవినేని మాట్లాడారు. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి ఫొటోలు పెట్టుకోవడంపై మండిపడ్డారు. ప్రజల తరఫున తాము ప్రశ్నిస్తుంటే.. బూతులతో ఎదురు దాడులకు దిగుతున్నారని దేవినేని ఆరోపించారు.

ఇదీ చదవండి: నాన్నకు అప్పులున్నాయి.. నా ఆస్తి రూ.2 కోట్లు తగ్గింది: లోకేశ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details