ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎంపీ నిధులతో చేసిన పనులకు.. వైకాపా బొమ్మలేసుకున్నారు' - ఎంపీ నిధులపై దేవినేని కామెంట్స్ న్యూస్

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎంపీ కేశినేని మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు వైకాపా బొమ్మలు వేసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సబ్బం హరి ఇంటి నిర్మాణాలను కూల్చేశారని ఆగ్రహించారు.

'ఎంపీ నిధులతో చేసిన పనులకు.. వైకాపా బొమ్మలెసుకున్నారు'
'ఎంపీ నిధులతో చేసిన పనులకు.. వైకాపా బొమ్మలెసుకున్నారు'

By

Published : Oct 3, 2020, 9:16 PM IST

రెడ్డిగూడెం మండలం పాతనాగులూరు గ్రామంలో సామాజిక భవనానికి ఎంపీ కేశినేని నాని 50 లక్షల రూపాయలు మంజూరు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. శిలాఫలకంపై బొమ్మలు వేసుకుని శంకుస్థాపన చేసిన వైకాపా శాసనసభ్యుడిపై.. అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.

ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్నారనే రాజకీయకక్షతోనే విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణాలను కూల్చి వేశారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ వేధింపులకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ తరహా చర్యలకు తెదేపా నాయకులు, కార్యకర్తలు భయపడబోరని దేవినేని ఉమా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details