రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు ఏం చెప్పినా...అధికార పార్టీకి పట్టదని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా... కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వమిచ్చిన నాసిరకం విత్తనాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రతి రైతుకు రూ.20 నుంచి 30 వేలకు వరకు పెట్టుబడి నష్టం వాటిల్లిందని వివరించారు. తమ అధినేత చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తే... అర్ధరాత్రి జీవోలు ఇచ్చి ఇన్సూరెన్స్ బకాయిలు చెల్లించారని వెల్లడించారు.
రైతు సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టదు: దేవినేని - జగన్పై దేవినేని కామెంట్స్
రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు ఏం చెప్పినా...అధికార పార్టీకి పట్టదని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. తమ అధినేత చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తే...అర్ధరాత్రి జీవోలు ఇచ్చి ఇన్సూరెన్స్ బకాయిలు చెల్లించారని వెల్లడించారు.
రైతు సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టదు