ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాధితులను బెదిరించి నిందితులను కాపాడాలని చూస్తున్నారా..?' - దేవినేని తాజా వార్తలు

నంద్యాల పోలీసులు రాత్రి 10 గంటలకు అబ్దుల్ సలాం ఇంటికి వెళ్ళి తెల్లకాగితంపై సంతకం చేయాలని సలాం అత్తపై ఒత్తిడి తీసుకురావటం దేనికి సంకేతమని మాజీమంత్రి దేవినేని ప్రశ్నించారు. బాధితులను బెదిరించి నిందితులను కాపాడాలని చూస్తున్నారా..? అని నిలదీశారు.

'బాధితులను బెదిరించి నిందితులను కాపాడాలని చూస్తున్నారా?'
'బాధితులను బెదిరించి నిందితులను కాపాడాలని చూస్తున్నారా?'

By

Published : Nov 13, 2020, 8:20 PM IST

సామూహిక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబసభ్యుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామ పట్ణణంలోని జామీయా మసీదులో మాజీమంత్రి దేవినేని ఉమా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నంద్యాల పోలీసులు రాత్రి 10 గంటలకు అబ్దుల్ సలాం ఇంటికి వెళ్ళి తెల్లకాగితంపై సంతకం చేయాలని సలాం అత్తపై ఒత్తిడి తీసుకురావటం దేనికి సంకేతమని దేవినేని ప్రశ్నించారు. బాధితులను బెదిరించి నిందితులను కాపాడాలని చూస్తున్నారా..? అని నిలదీశారు. బ్యాంక్ వివరాల కోసం వెళ్ళామని చెబుతున్న పోలీసులు... రాత్రిళ్ళు వెళ్లాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు. సెల్ఫీ వీడియో లేకపోతే కుటుంబ కలహాలతో అబ్దుల్ సలాం కుటుంబం చనిపోయినట్లు వైకాపా నాయకులు చిత్రీకరించేవారని ఉమా ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details