నేను అగర్బ శ్రీమంతుడిని అన్యాయాలు, అక్రమాలు సహించేది లేదని.. ఎన్నికల ప్రచారంలో బీరాలు పలికిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గ పరిధిలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ లలో జరుగుతున్న అక్రమాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ల్యాండ్, సాండ్, వైన్, మైన్ అక్రమాలపై సమాధానం చెప్పండి: దేవినేని - తెదేపా నేత దేవినేని ఉమ తాజా వార్తలు
మైలవరం నియోజకవర్గ పరిధిలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ లలో జరుగుతున్న అక్రమాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ సమాధానం చెప్పాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. నివాస యోగ్యం కాని బుడమేరు ముంపు భూముల విషయంలో ఎవరికి ఎంత ధర ఇచ్చి కొన్నారో.. బహిరంగంగా తెలిపి తన చిత్తశుద్ధిని నిరోపించుకోవాలని సవాల్ విసిరారు.
తెదేపా హయాంలో పంపిణీకి సిద్ధం చేసిన పూరగుట్ట భూముల విషయంలోనూ ఎమ్మెల్యే సొంత ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నివాస యోగ్యం కాని బుడమేరు ముంపు భూముల విషయంలో ఎవరికి ఎంత ధర ఇచ్చి కొన్నారో.. బహిరంగంగా తెలిపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఇష్టారీతి పాలన చేస్తూ.. కరోనా బారిన పడి ఉన్న నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన అనుచర, బంధుగణాలకు దోచిపెట్టేందుకు భూముల కొనుగోలుని ఉపయోగిస్తూ.. అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.