"ట్రాక్టర్ నడపలేడని లోకేశ్‌ను ఎద్దేవా చేసిన మంత్రి కొడాలి నాని.. పక్క రాష్ట్రానికి బస్సు నడపలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్‌ని ఏమంటారు?" అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని మాటకు మాట సమాధానం చెప్పి తీరుతామన్నారు. "రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేసిన జగన్.. ఇదేనా రైతు రాజ్యం?" అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికినా.. ప్రభుత్వం ఒక్కశాతం పనైనా పూర్తి చేసిందా అని నిలదీశారు. పోలవరంపై గతంలో వైకాపా చేసిన దుష్ప్రచారం వల్లే నేడు కేంద్రం నిధుల్లో కోత పెట్టిందని ఆరోపించారు.