ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ రంగంపై 2వేలకోట్ల భారం అవసరమా..? - ఉచిత విద్యుత్న పథకం వార్తలు

వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ బిగింపు చేయడమంటే.. ఉచిత విద్యుత్​కి మంగళం పాడినట్టేనని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.

devineni uma comments on jagan
మాజీ మంత్రి దేవినేని ఉమా

By

Published : Sep 6, 2020, 1:25 PM IST

18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ పెట్టి.. విద్యుత్ రంగంపై 2వేలకోట్ల భారం పెంచడం అవసరమా? అని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. రైతులు వ్యతిరేకిస్తున్నా మీటర్ బిగింపు వెనక మతలబేంటని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్​కి మంగళం పాడేందుకేనా ఈ మీటర్లని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నగదు బదిలీని వైకాపా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు, నిపుణులు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details