ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం గారూ..కరోనాపై ప్రజలకు వాస్తవాలు చెప్పండి'

ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులపై సీఎం జగన్ వాస్తవాలను వెల్లడించాలని తెదేపానేత దేవినేని ఉమా ఆరోపించారు. నిజాలు చెప్పనీయకుండా ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేసిందని విమర్శించారు.

దేనినేని ఉమా
దేనినేని ఉమా

By

Published : May 2, 2021, 2:20 PM IST

రాష్ట్రంలో భయానక ఆరోగ్య పరిస్థితులు నెలకొన్నాయని తెదేపానేత దేవినేని ఉమా ఆరోపించారు. ఆక్సిజన్ అందక, పడకలు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి కనీసం ముందుచూపు, ప్రణాళిక లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ కనీసం మీడియా ముందుకు వచ్చి వాస్తవ పరిస్థితులను వెల్లడించలేక పోతున్నారని ఆరోపించారు. సీఎం… కరోనా పరిస్థితులపై వాస్తవాలు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల్లో కరోనా వస్తే విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. శ్మశాన వాటికలో దహనసంస్కారాల కోసం క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేసింది

రాష్ట్రంలో వాస్తవాలు వెల్లడించకుండా మీడియా, పత్రికల గొంతు ప్రభుత్వ నొక్కేసింది అని ఆరోపించారు. విలేకరులకు కనీసం ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు, బస్ పాసులు ఇవ్వలేదని ఆరోపించారు. పాత్రికేయులు కరోనాతో మరణిస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై వెంటనే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో వాలంటీర్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

అరెస్ట్ చేసినా…ప్రశ్నిస్తూనే ఉంటా..

రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సుబాబుల్, మొక్కజొన్న, ధాన్యం, మిర్చి కొనుగోలు చేసే వారు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతుల ఇబ్బందులపై ప్రశ్నిస్తూనే ఉంటానని... ప్రభుత్వం తనను జైలుకు పంపించిన సిద్ధమని సవాల్ విసిరారు. సీఐడీ అధికారులు విచారణ పేరుతో నన్ను గంటల తరబడి కార్యాలయంలో ఉంచుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తన పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.

ఇదీ చదవండి

అభిమాని ఆరోగ్యంపై చిరంజీవి ఆరా

ABOUT THE AUTHOR

...view details