రాష్టంలో రైతుల ఆవేదన.. బాధ కలిగిస్తుందని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పులపాలైన రైతుల పరిస్థితి సీఎం జగన్ కు కనిపిస్తోందా అంటూ ప్రశ్నించారు. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సీఎం నియోజకవర్గం నుంచి అరటిని దిగుమతి చేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతులను మార్కెట్ శక్తులకు ప్రభుత్వం వదిలేసిందని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు పండించిన పంటను పొలాల్లోనే వదిలేస్తుంటే.. పులివెందుల అరటికి 20 రూపాయలు ఎలా చెల్లించారో చెప్పాలన్నారు. ఈ అంశంపై రైతులకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'రైతుల ఆవేదన సీఎంకు వినబడుతోందా..?' : దేవినేని - రాష్ట్రంలో రైతుల అవస్థలు
వైకాపా ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవడం లేదని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే.. పులివెందుల అరటికి 20 రూపాయలు ఎలా చెల్లించారో... సీఎం జగన్ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
devineni uma