ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వలస కూలీలు, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి' - దేవినేని ఉమ దీక్ష తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని... తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. దీనికి నిరసనగా తన ఇంటివద్దే 12 గంటల దీక్ష చేపట్టారు. వలస కూలీలు, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

devineni uma
devineni uma

By

Published : May 1, 2020, 3:51 PM IST

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా తన నివాసంలో మాజీమంత్రి దేవినేని ఉమ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు 5వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద భవన నిర్మాణ కార్మికుల నిధి కింద సెస్ రూపంలో ఉన్న నిధులను..వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మూసేసిన అన్నా క్యాంటీన్లను తెరచి... చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని దేవినేని డిమాండ్‌ చేశారు. ధాన్యం, మామిడి, పత్తి, మిర్చి, మల్లె, టమాటా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలని కోరారు. ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దేవినేని ఉమ దీక్షకు రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సంఘీభావం తెలిపారు.

ఇవీ చదవండి:ఆయన చెట్టుకు 'మోదీ' సహా.. వందల రకాల పండ్లు

ABOUT THE AUTHOR

...view details