వైకాపా ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశంలోనే పేరుగాంచిన కృష్ణా జిల్లా చండ్రగూడెం మల్లె రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మల్లె ధరలపై స్పష్టమైన విధానం అమలు చేయకపోవడంతో సీజన్లో సైతం అరకొర ధరలకు అమ్ముకొని రైతులు పెట్టుబడులు కూడా పొందలేక పోతున్నారని ఆయన వాపోయారు. కరోనా లాక్డౌన్ వల్ల మార్కెట్లో ధర లేక ఇబ్బందులు పడుతున్న మల్లె రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ధాన్యం కల్లాల పరిశీలన