దేవినేని ఉమ, వర్ల రామయ్య గృహ నిర్బంధం - దేవినేని ఉమ గృహ నిర్బంధం
తెదేపా నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అచ్చెన్నాయుడిని విజయవాడ తీసుకువస్తునందున ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.

devineni uma and varla ramaiah house arrested
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని విజయవాడ తీసుకువస్తునందున తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమని గొల్లపూడిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే ఇంటి నుంచి బయలుదేరిన తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్యను అడ్డగించి పోలీసులు గృహనిర్భందం చేశారు. మరోవైపు అచ్చెన్నాయుడి అరెస్టుపై మాట్లాడేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా విశాఖలో తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్టు చేసి పరవాడ పోలీసుస్టేషన్‌కు తరలించారు.