రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసి 90 శాతం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చుకున్న వాళ్లతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయొచ్చని దేవినేని ఉమా సూచించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఆడవాళ్లు నిత్యావసరాల కోసం బయటకు వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిత్యావసరాల కోసం ప్రజలు క్యూలైన్లలో నిలబడిన ప్రాంతాల్లో పర్యటించిన ఉమా.. పేదవాడికి ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో పంచదార, గోధుమ పిండిపై 30 రూపాయలు వసూలు చేయటం సరికాదన్నారు. ఏవేవో కారణాలు చెప్పి ఉదయం 4గంటల నుంచి 11గంటల వరకూ క్యూలో నిలబెట్టి మరుసటిరోజు రమ్మనటం భావ్యం కాదని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.
రాజకీయాలు మాట్లాడే సమయం కాదు: దేవినేని - కొడాలి నానిపై దేవినేని ఉమా ఫైర్ న్యూస్
రాజకీయాలు మాట్లాడే తరుణం కాదని వైకాపా ప్రజాప్రతినిధులు గ్రహించి మానవత్వంతో పని చేయాలని మాజీమంత్రి దేవినేని ఉమా హితవు పలికారు. ఆడవాళ్లు నిత్యావసరాల కోసం బయటకొస్తుంటే.. హై లెవల్ కమిటీ, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
![రాజకీయాలు మాట్లాడే సమయం కాదు: దేవినేని రాజకీయాలు మాట్లాడే సమయం కాదు: దేవినేని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6605704-627-6605704-1585649666161.jpg)
రాజకీయాలు మాట్లాడే సమయం కాదు: దేవినేని