ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ..అరాచక పాలన చేస్తున్నారని,మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.సీఎం జగన్ తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబు,వర్ల రామయ్య,వల్లభనేని వంశీలపై అక్రమ కేసులను బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ తప్పిదాలను వెలికి తీస్తున్న పత్రికలపైన కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు.జీవో938తెరపైకి తెచ్చి మీడియాని బ్లాక్మెయిల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు.తప్పుడు కేసులపై త్వరలో ఉద్యమం చేపడతామని ఉమా హెచ్చరించారు.
అరాచకపాలనపై ఉద్యమం చేపడతాం:దేవినేని ఉమా - devineni uma latest news
ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన వారందరిపై వైకాపా ప్రభుత్వం కేసులు పెడుతోందని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలపై త్వరలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
![అరాచకపాలనపై ఉద్యమం చేపడతాం:దేవినేని ఉమా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4819509-1073-4819509-1571639133528.jpg)
ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని