విశాఖపట్నం జిల్లాలో సహజ సిద్ధమైన లక్షల కోట్ల విలువ చేసే బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కన్ను పడిందని... అందుకనే ప్రజా వ్యతిరేకత ఉన్నా రాజధానిని తరలించేందుకు మొండి వైఖరితో ప్రవర్తిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయంపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా 52 వేల ఎకరాలు చేతులు మారాయని దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని దేవినేని అన్నారు. ఇంత ఆరాటపడుతూ రాజధాని మార్చడం వెనుక పెద్ద ఉపాయమే దాగి ఉందని త్వరలో ప్రజాకోర్టులో ప్రభుత్వాన్ని ఎండగడతామని దేవినేని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మెుండిగా వ్యవహరిస్తున్నారు: దేవినేని ఉమ
విశాఖపట్నం జిల్లాలో సహజసిద్ధమైన లక్షల కోట్ల విలువ చేసే బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కన్నుబడిందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్న రాజధానిని తరలించేందుకు మొండి వైఖరితో ప్రవర్తిస్తున్నారని అయన అన్నారు.
ముఖ్యమంత్రి మెుండి గా వ్యవహరిస్తున్నారు:దేవినేని ఉమ
TAGGED:
devineni fire on ap cm