ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Devineni:'ఆస్తి, చెత్త పన్నుల పెంపు జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలి' - దేవినేని తాజా వార్తలు

ఆస్తి, చెత్త పన్నులకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. తెదేపా కార్పొరేటర్లను మున్సిపల్‌ సమావేశానికి వెళ్లకుండా పోలీసులు ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు.

devineni uma
devineni uma

By

Published : Jul 15, 2021, 7:44 PM IST

ఆస్తి ఆధారిత పన్ను, చెత్త పన్నుకు సంబంధించిన జీవోలను.. ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెదేపా కార్పొరేటర్లను మున్సిపల్‌ కార్యాలయంలో జరిగే సమావేశానికి వెళ్లకుండా.. పోలీసులు అడ్డుకోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణ లంక పోలీసు స్టేషన్​లో ఉన్న తెదేపా, వామపక్ష నేతలను ఆయన పరామర్శించారు. సీఎం జగన్ తాడేపల్లి రాజప్రసాదంలో.. 144 సెక్షన్‌ అమల్లో పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో చట్టబద్దమైన పరిపాలన లేదని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details