మీడియాతో దేవినేని అవినాశ్ కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్ధిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు. యువ నేత వెంట కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్ వేసే ముందుస్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణపురంలోని ఆయన స్వగృహంలో సర్వమత ప్రార్ధనల్లో పాల్గొని... తల్లి లక్ష్మీ ఆశీస్సులు తీసుకున్నారు.స్థానిక తెదేపా నేతలతో కలిసి ఎడ్లబండిపైనే గుడివాడ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నామపత్రం దాఖలు చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానని.... తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో తెదేపా జెండాను ఎగురవేస్తానని చెప్పారు.