ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటమిపై తొలిసారి స్పందించిన అవినాశ్.. ఏమన్నారంటే!

గుడివాడ నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు దేవినేని అవినాశ్. ఫలితాల అనంతరం ఆయన తొలిసారి స్పందించారు. తన గెలుపు కోసం పోరాడిన ప్రతి ఒక్క కార్యకర్తకు రుణపడి ఉంటానన్నారు.

ఎన్నికల్లో తెదేపా ధర్మయుద్ధం చేసింది:దేవినేని అవినాశ్

By

Published : May 27, 2019, 5:40 AM IST

ఎన్నికల్లో తెదేపా ధర్మయుద్ధం చేసింది:దేవినేని అవినాశ్
తెలుగు దేశం పార్టీ తరపున గుడివాడలో ధర్మ యుద్ధం చేశామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. అయినా అక్కడి ఓటమి ఒక దురదృష్టమన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అవినాశ్ ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు, దేవినేని అభిమానులు తొలిసారి సమావేశమయ్యారు. జగన్​పై తనకేం వ్యతిరేక లేదని అవినాశ్ అన్నారు. ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆశించారు. వైకాపా గెలిచిన వెంటనే తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలేనని.. మరో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటానన్నారు. ఈలోపు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దేవినేని నెహ్రూ అభిమానులకు కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆయన తాజా ఎన్నికల్లో కొడాలి నాని చేతిలో ఓటమి పాలైన విషయం విదితమే.

ABOUT THE AUTHOR

...view details