మంత్రి మానవత్వం - krishna district
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లారీని తప్పించబోయే క్రమంలో డివైడర్‌ను ఢీకొని గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన మంత్రి దేవినేని ఉమ.. క్షతగాత్రులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
మంత్రి దేవినేని మానవత్వం
కృష్ణాజిల్లా కొండపల్లి సమీపంలోజాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లారీని తప్పించబోయే క్రమంలో డివైడర్‌ను ఢీకొని గాయాలపాలయ్యారు.అటుగా వెళ్తున్న మంత్రి దేవినేని ఉమ.. ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. ఘటనాస్థలానికిచేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.