ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించే కుట్ర జరుగుతోంది' - news on devineni uma

కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. అమరావతి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్ర వైకాపా పన్నుతుందని ఆరోపించారు.

devi neni uma on kollu ravindra
వైకాపాపై దేవినేని ఉమా

By

Published : Jul 3, 2020, 2:38 PM IST

బందరులో జరిగిన వైకాపా నాయకుడి హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఇరికించే కుట్ర జరుగుతోందని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. మాజీ మంత్రి నడికుడి నరసింహారావుకి బందరులో మంచి పేరు ఉందని... అటువంటి కుటుంబం నుంచి కొల్లు రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారని దేవినేని ఉమా అన్నారు. తాడేపల్లి రాజాప్రసాదం నుంచి వచ్చిన స్క్రిప్ట్​ను సజ్జల అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి... కొల్లు రవీంద్రని ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. వైఎస్ఆర్​లో వై అంటే వైవీ సుబ్బారెడ్డికి 5 జిల్లాలు, ఎస్ అంటే సాయిరెడ్డికి 3జిల్లాలు, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి 5జిల్లాలు అప్పజెప్పారని ద్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలను లెక్క చేయకుండా వైకాపా నేతలు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details