ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వరదొచ్చినా.. మేము ఇక్కడినుంచి కదిలేది లేదు" - karakatta

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని....బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రవాహం అంతకంతకూ పెరుగుతుతుండటంతో....నదీ పరీవాహకంలోని నివాసాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయినప్పటికీ కొంతమంది పునరాస కేంద్రాలకు వెళ్లటం లేదు. కరకట్టనే ఆవాసంగా మార్చుకున్నారు.

కరకట్ట

By

Published : Aug 17, 2019, 1:10 PM IST

బాధితుల ఆవేదన

విజయవాడలోని కృష్ణలంక తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్, గీతానగర్​లోని చాలా ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే చాలామంది ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లగా.... చాలామంది విలువైన సామాన్లు ఎమైపోతాయోనని కట్టుబట్టలతో కరకట్టపై ఉంటున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం, రాణిగారితోటలోని కమ్యూనిటీ భవనంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా...వాటిలో ఎక్కువమంది ఉండేందుకు వీలు లేకపోవడంతోనూ చాలామంది కరకట్టపై ఉంటున్నారు. తడిచిన బట్టలు, వస్తువులను ఆరబెట్టుకుంటూ... మరోవైపు వరద ప్రవాహం ఎక్కడ పెరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తున్నారే తప్ప ఏమీ చేయడం లేదని....సరఫరా చేసే ఆహారం కూడా బాగోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గీతానగర్ వరకు ఉన్న రక్షణ గోడను... పొడిగించి తమను ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details