రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని కుల, మత, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు అంజాద్ బాషా, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని వారు తెలిపారు. విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేయటానికి త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
హామీలన్నీ నెరవేర్చుతున్నాం: ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా - విజయవాడలో శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా