ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గత ప్రభుత్వాల తప్పిదాల వల్లే..రోడ్లకు ఈ దుస్థితి' - కృష్ణాజిల్లా సమాచారం

లేని తప్పును చూపించేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, స్థాయి మరచి ఆశ్చర్యకరమైన విమర్శలు చేస్తున్నాయనీ ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. 20 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కనుమూరి రాజాబాబు ఆదర్శవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారని కృష్ణదాస్ కొనియాడారు.

ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Sep 15, 2021, 9:58 PM IST

గత ప్రభుత్వాల తప్పిదాల వల్లే నేడు రాష్ట్రంలో రహదారుల సమస్య తలెత్తిందనీ ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి నందివాడ మండలం జొన్నపాడు వరకు 20 కిలోమీటర్ల మేర రహదారులకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కనుమూరి రాజాబాబు సొంత నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులను కృష్ణదాస్ పరిశీలించారు.

రహదారుల అభివృద్ధికి బాపులపాడు గ్రామానికి చెందిన ఆక్వా రైతు మూర్తి.. లక్ష రూపాయల నగదు చెక్కును కృష్ణదాస్​కు అందజేశారు. లేని తప్పును చూపించేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, స్థాయి మరచి ఆశ్చర్యకరమైన విమర్శలు చేస్తున్నాయనీ కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. 20 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తూ రాజాబాబు ఆదర్శవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారని కృష్ణదాస్ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details