ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామీణ ప్రాంతాల పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ - ap new tourism policy news

గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు పర్యాటకశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రానికే ప్రత్యేకమైన కొన్ని ప్రాంతాల్లో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా విలాసవంత హోటళ్ల నిర్మాణానికి వీలుగా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రత్యేకించి తీర ప్రాంతాల్లో ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టనున్నారు.

ap tourism
ap tourism

By

Published : Oct 22, 2020, 5:31 AM IST

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు, ప్రకృతి రమణీయతను పర్యటకులకు పరిచయం చేసేలా వివిధ ప్రాజెక్టులు చేపట్టాలని పర్యాటక శాఖ భావిస్తోంది. రాష్ట్రానికే ప్రత్యేకమైన కొన్ని ప్రాంతాల్లో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా విలాసవంత హోటళ్ల నిర్మాణానికి వీలుగా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. కోనసీమ లాంటి ప్రాంతాలను విదేశీ పర్యటకులకు సైతం పరిచయం చేయటంతో పాటు అక్కడికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది.

ఆతిథ్య రంగంలో పెట్టుబడుల ఆహ్వానానికి నూతన పర్యాటక విధానాన్ని అధికారులు రూపొందిస్తున్నారు. సుదీర్ఘ తీరప్రాంతమున్న రాష్ట్రంలో వివిధ ప్రదేశాలింకా పర్యాటకానికి దూరంగా ఉన్నాయని... వాటి అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపునకు కేంద్రాన్ని కోరారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీరప్రాంతాల్లో విలాసవంతమైన హోటళ్లు, రిసార్టుల నిర్మాణంతో పాటు ఇతర వినోద పార్కులు, సాహస క్రీడల ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక శాఖకు నివేదించారు. రాష్ట్రంలో ఉన్న విమానాశ్రాయాల్లో కనెక్టివిటీ సమస్య తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details