కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో దివిసీమ ఉప్పెన సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప్పెన దివిసీమను అతలాకుతలం చేసిందని బుద్ధప్రసాద్ వ్యాఖ్యనించారు. జాతీయ, అంతర్జాతీయ స్థానిక సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దివిసీమ పునర్నిర్మాణంలో భాగమయ్యాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి కొన్ని చట్టాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాల్టా సీఆర్జెడ్ పర్యావరణ పరిరక్షణ చట్టాలను అమలు చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్రం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. యువత చట్టాలపై అవగాహన తెచ్చుకొని ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని పిలుపునిచ్చారు.
అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో దివిసీమ ఉప్పెన సంస్మరణ సభ
వాల్టా సీఆర్జెడ్ పర్యావరణ పరిరక్షణ చట్టాలను అమలు చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్రం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మండలి బుద్ధ ప్రసాద్ వ్యాఖ్యనించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నిర్వహించిన దివిసీమ ఉప్పెన సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు.
అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో దివిసీమ ఉప్పెన సంస్మరణ సభ