ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాజా దరఖాస్తుదారులకు.. 10 రోజులపాటు రోజుకో పథకం

సీఎం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.... అర్హులై ఉండి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి, తాజా దరఖాస్తుదారులకు శుక్రవారం నుంచి పది రోజులపాటు సాయమందించాలని మంత్రిమండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

10 రోజులపాటు రోజుకో పథకం
10 రోజులపాటు రోజుకో పథకం

By

Published : Nov 6, 2020, 8:06 AM IST

Updated : Nov 6, 2020, 12:33 PM IST

అర్హులై ఉండి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోయిన వారికి, తాజా దరఖాస్తుదారులకు శుక్రవారం నుంచి వరుసగా 10 రోజులపాటు సాయమందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం మంత్రులతో కాసేపు చర్చించి, కొన్ని అంశాలపై సూచనలు చేశారు.

* స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలో డీఎడ్‌ కోర్సులో చేరిన 27 వేల మంది విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయిందని మంత్రి విశ్వరూప్‌ వివరించగా.. ఈ ఏడాదివరకు పరీక్షలకు అనుమతించేలా చూడాలని సీఎం చెప్పారు.

* పాఠశాలలు తెరవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకూ కరోనా సోకుతోందని పలువురు మంత్రులు ప్రస్తావించగా ‘ఎక్కడో ఒకచోట పాఠశాలలు ప్రారంభం కావాలి కదా? అందుకే రోజుమార్చి నిర్వహిస్తున్నాం. పిల్లలకు హాజరు తప్పనిసరని పెట్టలేదుగా’ అని సీఎం అన్నారు.

* అనంతపురంజిల్లాలో వేరుసెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి శంకరనారాయణ తెలిపారు. సీఎం స్పందిస్తూ నివేదిక తెప్పించి, రైతులకు అండగా నిలవాలని ఆదేశించారు.

* నిజాంపట్నం, జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నంలలో ఏర్పాటు చేయదలచిన చేపల రేవులకు ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శంకుస్థాపన చేస్తే బాగుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రిని కోరారు. ‘ఇంకా టెండరు స్థాయిలో ఉన్నాయి కదా? అప్పటికి ప్రక్రియ కొలిక్కి వస్తే ఆలోచిద్దాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు

ఇవీ చదవండి

'అప్పుడే అమ్మభాష పదికాలాలు మనగలుగుతుంది'

Last Updated : Nov 6, 2020, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details