కరోనా కట్టడికి స్వీయ రక్షణ విధానాలను పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని గవర్నర్ బిశ్వభూషణ్.. వివిధ మత, ఆధ్యాత్మిక సంస్థలకు సూచించారు. ఈ మేరకు విజయవాడలోని రాజ్ భవన్ నుంచి ఆయన వెబినార్ సమావేంలో పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లో మత విశ్వాసాలకు ఒక ప్రత్యేకత ఉందని.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆందోళ చెందకుండా, ప్రశాంతంగా ఉండటానికి.. ప్రవచనాలు, ప్రసంగాల ద్వారా బాధితుల్లో మనస్తైర్యం నింపాలని విజ్ఞప్తి చేశారు.
స్వీయ రక్షణ పాటించాలి..
మానవాళి మొత్తానికి కొవిడ్ వ్యాప్తి సవాలుగా మారిందన్నారు. మాస్క్ ధరించడం సహా భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి చర్యల ద్వారా మహమ్మారి కల్లోలాన్ని నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఇళ్లల్లోనే ఉండటం మేలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అనవసరమైన ప్రయాణాలకు సైతం దూరంగా ఉండాలని.. పండుగలు, ఇతరత్రా నివాసాల్లోనే జరుపుకునేలా జనాలకు వివరించాలని కోరారు.
పండుగలు, వేడుకలు ఇళ్లల్లోనే..
శుభకార్యాలు, ఇతర వేడుకలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని.. లేదా పరిమిత సభ్యులతో కొవిడ్ మార్గదర్శకాలను కఠినంగా పాటిస్తూ నిర్వహించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. కొవిడ్ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల ఇంట్లో లేదా ఆస్పత్రుల్లో వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గి ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చన్నారు.
ఇంతగా ఎవరూ ఊహించలేదు..