కూతురే తండ్రి చితికి కొరివి పెట్టిన సంఘటన కృష్ణా జిల్లా నందిగామలో జరిగింది. పట్టణంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న హాల్లో గేట్ కీపర్‌గా పని చేసిన కురాకుల నాగభూషణరావు (75) తెల్లవారుజామున మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మగ పిల్లలు లేరు. నాగభూషణరావు కర్మకాండలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. చివరికి.. పెద్ద కూతురు కనక దుర్గ ముందుకు వచ్చి అన్ని తానై తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేసింది.
తండ్రి చితికి కొరివి పెట్టిన కూతురు - నందిగామలో తండ్రి చితికి కొరివి పెట్టిన కూతురు
నాగభూషణరావుది పేద కుటుంబం. ముగ్గురు కుమార్తెలున్నారు. గేట్ కీపర్‌గా పనిచేస్తున్న ఆయన తెల్లవారుజామున కన్ను మూశారు. కుమారులు లేకపోవటంతో అంత్యక్రియలు నిర్వహించటానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో పెద్ద కుమార్తే అన్ని తానై తన తండ్రికి చివరి తంతును నిర్వహించింది.

తండ్రి చితికి కొరివి పెట్టిన కూతురు