ముదిమి వయస్సులో కన్నతల్లి బాధ్యత చూసుకోవాల్సిన కూతురే నిర్ధాక్షిణ్యంగా వదిలేసింది. ఆస్తిని లాక్కుని.... ఆరు రోజుల క్రితం కృష్ణా జిల్లా నూజివీడులో ఆసుపత్రి బయట విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ మాతృమూర్తి అప్పటి నుంచి అక్కడే సరైన భోజనం, వసతి లేక విలపిస్తోంది. చివరకూ 'ఈటీవీ' ఆమె దీనస్థితిని గమనించి..... ఆస్పత్రిలో చేర్పించారు. ముత్యాలంపాడుకి చెందిన చిలకమ్మకు చెందిన ఇంటిని, పింఛన్‌ను నగదును ఆమె కుమార్తె నిర్మల తీసుకుంది. ఆస్పత్రి ఎదుట ఆరుబయట చలిలో గజగజ వణుకుతూ, ఎవరిని ఏమీ అడగలేని దీన స్థితిలో ఉన్న చిలకమ్మను చూసి స్థానికులు అన్నం పెట్టేవారు. చివరికూ 'ఈటీవీ' సాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు.
ఆస్తి లాక్కుని.. కన్న తల్లిని రోడ్డు మీద వదిలేసిన కూతురు
కంటికి రెప్పలా పెంచిన తల్లిని భారంగా భావించిదో కుమార్తె.. జీవిత చరమాంకంలో అండగా ఉండాల్సింది పోయి వీధిలోకి గెంటేసింది. ఆమె ఆస్తితో పాటు...ఇంటిని, పింఛను లాక్కొని నిర్ధాక్షిణ్యంగా బయటకి నెట్టేసింది.
ఆస్తి లాక్కుని కన్న తల్లిని రోడ్డు మీద వదిలేసిన కూతురు