ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ అత్త హత్య కేసులో.. కోడలికి జీవిత ఖైదు! - telangana khagipet murder case

అత్త హత్య కేసులో కోడలు సహా మరో ముగ్గురికి తెలంగాణ వరంగల్​ జిల్లా న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 2012 నాటి కేసులో సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు.. అనేక చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువచ్చారు.

telangana khagipet murder case
వరంగల్ న్యాయస్థానం

By

Published : Nov 25, 2020, 12:57 PM IST

అత్త హత్య కేసులో కోడలికి తెలంగాణ వరంగల్ జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. హత్యలో పాల్గొన్న మరో ముగ్గురికీ అదే శిక్ష వేసింది. 2012లో జరిగిన ఈ హత్య కేసులో నేరం రుజువు కావడం వల్ల మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జయకుమార్ తీర్పు ఇచ్చారు.

తెలంగాణ వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని ప్రశాంత్ నగర్​కు చెందిన వన్నాల సతీశ్​ బాబు 2007లో సౌజన్యను వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. తల్లి స్వర్ణ, సౌజన్యను ఇంటి వద్దే ఉంచాడు. స్వర్ణ అటవీ శాఖలో ఉద్యోగి కాగా, సౌజన్య ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా పనిచేసేది.

మిస్ట్​కాల్​తో పరిచయం..

ఒక రోజు సౌజన్యకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం రామయ్యపల్లికి చెందిన దేవునూరి నరేష్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆమె తిరిగి మళ్లీ ఫోన్ చేయగా ఇద్దరి మధ్య సంభాషణ పెరిగి అదికాస్తా పరిచయంగా మారింది. నరేష్.. సౌజన్య ఇంటికి వచ్చి చనువుగా ఉండేవాడు. అనంతరం ఖర్చుల కోసం డబ్బులు కావాలని సౌజన్యను డిమాండ్ చేశాడు నరేష్​. డబ్బు ఇవ్వకపోతే ఇరువురి మధ్యనున్న సన్నిహిత్యాన్ని బహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడడం వల్ల అత్త స్వర్ణకు చెందిన ఏటీఎం కార్డు ఇచ్చింది. కార్డు ద్వారా డబ్బు ఉపసంహరిస్తే అనుమానం వస్తుందని చెప్పిన నరేష్.. స్వర్ణను హత్య చేయాలని కుట్రపన్నాడు. హత్యచేయవద్దని వారించి బంగారం కూడా ఇస్తానని సౌజన్య చెప్పింది. అయిన నరేష్​ వినకుండా.. బ్యాంకులో ఉన్న రూ.15 లక్షలతో పాటు బంగారం తీసుకోవచ్చునని ప్రణాళిక రచించాడు.

ఎన్నో చీకటి కోణాలు..

ఈ క్రమంలో 2012 అక్టోబర్ 12న రాత్రి నరేష్ అతని మిత్రులు కిరణ్, క్రాంతికుమార్ కలిసి సౌజన్య ఇంటికి వచ్చారు. సౌజన్యను బాత్ రూంకు పంపి.. నిద్రపోతున్న స్వర్ణ కాళ్లు, చేతులు కట్టేసి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. హత్య జరిగిన నెల రోజులకు సౌజన్య 8 వారాల గర్భవతిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సౌజన్య భర్త సతీశ్​కు అనుమానం వచ్చింది. తన తల్లి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించడంపైనా నిలదీశాడు. అనుమానంతో కాజీపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమగ్ర దర్యాప్తుతో ఘటనలో చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవీచూడండి:ఆత్మహత్యకు సహకరించలేదని.. యువతిని కడతేర్చిన ప్రియుడు

ABOUT THE AUTHOR

...view details