ఇంద్రీకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు అభయమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ, అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అలంకరణలోని అమ్మవారు భక్తుల క్షుద్బాధను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణా దేవి అవతారం నుంచి జగన్మాతను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది.
అన్నపూర్ణదేవిగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ - ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వరోజు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అన్నపూర్ణదేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ అలకారంలోని అమ్మవారిని దర్శించుకున్నవారికి క్షుద్బాధ ఉండదని భక్తుల నమ్మకం.
అన్నపూర్ణదేవిగా ఇంద్రకీలాద్రి కనకదర్గమ్మ