విజయవాడ ఇంద్ర కీలాద్రిపై శ్రీ దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో ఎనిమిదో రోజు కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహిశాసుర మర్థని రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు.
ఇంద్రకీలాద్రీపై శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తోన్న అమ్మవారు
ఇంద్రకీలాద్రీపై దసర శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని డీజీపీ గౌతమ్ సవాంగ్, తెదేపా నేత నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకుని పూజలు చేశారు.
ఇంద్రకీలాద్రీపై శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తోన్న అమ్మవారు
నేడు అమ్మవారిని దర్శించుకుంటే సకలం శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అమ్మవారిని డీజీపీ గౌతమ్ సవాంగ్, తెదేపా నేత నిమ్మకాయల చిన రాజప్ప దర్శించుకుని పూజలు చేశారు.
ఇవీ చదవండి