ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి' - ఈరోజు విజయవాడ ధర్నాచౌక్​లో ఆందోళన చేపట్టిన దళిత బహుజన సంఘాలు వార్తలు

విజయవాడ ధర్నా చౌక్​లో దళిత, గిరిజన, బహుజన సంఘాలు నిరసనకు దిగాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Dalit, tribal and Bahujan communities protest
ధర్నా చౌక్ లో దళిత, గిరిజన, బహుజన సంఘాలు నిరసన

By

Published : Mar 18, 2021, 6:43 PM IST

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ.. విజయవాడ ధర్నా చౌక్​లో దళిత, గిరిజన, బహుజన సంఘాలు నిరసనకు దిగాయి. తక్షణమే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్ట్రాసిటీ కేసు నమోదు చేసి, శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్​పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే...ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details