ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతి తీవ్ర తుపానుగా మారనున్న ఫొని.....!

ఆగ్నేయ బంగాళాఖాతంలో.. హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఏర్పడిన తుపాను ఫొని అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది.

ఫొణి తుపాను

By

Published : Apr 28, 2019, 5:47 AM IST

Updated : Apr 28, 2019, 10:13 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో... హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఏర్పడిన తుపాను ఫొని మచిలీపట్నం తీరానికి 1260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తమిళనాడులోని చెన్నైకి 1,080 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలికి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు స్పష్టం చేశారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా వస్తోందని వాతావరణశాఖ వెల్లడించింది.

ఫొని క్రమంగా దిశ మార్చుకుని ఈశాన్యం వైపు కదిలి బంగ్లాదేశ్, మయన్మార్ వైపునకు వెళ్లే అవకాశముందని అధికారులు గుర్తించారు. తుపాను ప్రభావం వల్ల ఈనెల 29,30 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలుల వేగం బలపడి సుమారు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, కోస్తాంధ్ర, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

అతి తీవ్ర తుపానుగా మారనున్న ఫొని.....!
Last Updated : Apr 28, 2019, 10:13 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details