ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైబర్​ కేటుగాళ్ల కొత్త పంథా... పోలీసుల పేరుతో మోసాలు!

సైబర్ నేరగాళ్లు పంథాను మార్చారు. పోలీసుల పేరు, ఫొటోలతోనే మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు స్పష్టించి డబ్బులు దోచేస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి.

cyber crimes
cyber crimes

By

Published : Sep 10, 2020, 5:57 AM IST

'నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. అత్యవసరంగా 5 వేల రూపాయలు అవసరం' అంటూ ఓ ఆర్​ఎస్సై ఫేస్​బుక్​లో తన స్నేహితునికి మెసేజ్ పంపారు. పేటీఎంలో నగదు పంపాలని నంబర్ ఇచ్చారు. విషయం ఆర్​ఎస్సైకి చేరగా... షాకయ్యాడు. అది తన పేస్​బుక్ ఖాతా కాదని మిత్రుడికి వెల్లడించారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ... ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లొకేషన్ జార్ఖండ్, పేటీఎం ఖాతా చిరునామా పంజాబ్​లోని లూథియానాగా తేలిందని ఇన్స్పెక్టర్ తెలిపారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల ఇదే తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

మొదట పోలీసుల అధికారుల ఫేస్​బుక్ ఖాతాల నుంచి ఫొటోలు, స్నేహితుల వివరాలను సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. వారి ఫొటోలను వినియోగించి నకిలీ ఫేస్​బుక్ ఖాతాను తెరుస్తారు. అనంతరం డబ్బు అవసరమంటూ అధికారుల స్నేహితులకు సందేశాలు పంపిస్తారు. ఈ విధంగా సైబర్ కిలాడీలు నగదు దోచుకోవటంతో పోలీసు సిబ్బందికి అధికారులు సూచనలు జారీ చేశారు. నగదు పంపాలని సందేశం వస్తే... సంబంధిత వ్యక్తి ఫోన్ చేసి నిజమో.. కాదో తెలుసుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details