సైబర్‌క్రైమ్ నేరగాళ్లు విజయవాడ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తప్పించుకుంటున్నారు. వివిధ రకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించుకుని తమ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఆధారాలను మాయం చేస్తుంటారు. ఈ నేరాలను అరికట్టేందుకు..నిందితులను పట్టుకునేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. నిందితులను గుర్తించటం, కొత్త సాఫ్ట్వేర్ అంశాలపై నిపుణులతో శిక్షణ తీసుకుంటున్నామన్నారు.
డార్క్వెబ్సైట్ల నుంచి...
సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్ నుంచి నేరాలకు పాల్పడుతుంటారు. మారుపేర్లు, నకిలీ ఐపీ అడ్రస్‌లు, ప్రాక్సీ సర్వర్లను వినియోగిస్తూ తప్పించుకుంటారు. నిందితుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఖచ్చితంగా కొన్ని డిజిటల్ ప్రింట్స్ వదిలేస్తాడు. వాటిని ఉపయోగించి ఆధారాలు సేకరించవచ్చు. ఎక్కడో ఉండి ఇంక్కెక్కడి నుంచో మోసాలకు పాల్పడటం వల్ల కేసులు ఛేదించటం కొంత ఆలస్యం కావచ్చు. కానీ నేరస్థున్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు - శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ ఇన్స్ పెక్టర్ ,విజయవాడ