సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది తమ ఖాతాలోని సొమ్మును పోగొట్టుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులమని మాచవరానికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసిన దుండగలు ఏని డెస్క్ యాప్ ద్వారా అతని ఖాతాలో సుమారుగా... 7 లక్షల 71 వేలు నగదును అపహరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అధికమెుత్తంలో చాలా మంది నగదు పొగొట్టుకున్న ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మోసపూరితమైన మాటలను నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పేటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి అధిక మెుత్తంలో నగదును తస్కరిస్తున్నారు. చరవాణిలకు సందేశాలు పంపి... వేలకు వేలుు దండుకుంటున్నారు. కొంతమంది లింక్‌ల ద్వారా అప్లికేషన్లను డౌన్లోడ్ చేయించి నగదును స్వాహా చేస్తున్నారు. ఏవైనా నగదు లావాదేవీలు చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు తెలిపారు. చరవాణిలకు ఓటీపీ నెంబర్‌ను వచ్చాక... నిర్దరణ చేసుకోవాలని సూచిస్తున్నారు. తెలియని లింక్‌లు ఓపెన్ చేయొద్దంటున్నారు. తెలియని ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పొద్దని అంటున్నారు. కొత్త యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ముందు... వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండి నగదును కాపాడుకోవాలని సూచిస్తున్నారు.