విజయవాడకు చెందిన ధూపాటి శ్రీదేవి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను జాతీయ పార్టీకి చెందిన వ్యక్తినని..దిల్లీలో ఉంటానని చెప్పాడు. మీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని అందుకు వాట్సప్‌నంబర్‌కు వివరాలు పంపాలని నమ్మించాడు. చివరకు తన కుమారుడి అప్రమత్తతతో..ప్రమాదం తప్పింది.
మన బలహీనతే.. సైబర్ కేటుగాళ్ల పెట్టుబడి - cyber crime news in vijayawada
మనిషి బలహీనతలు , డబ్బుపై ఉండే కాంక్షే.. సైబర్ నేరస్తులకు ఆయుధాలు . ఎక్కడ ఉంటారో తెలీదు...ఎర వేసి మాయమాటలతో ఆకర్షిస్తారు. దర్జాగా నగదును దోచేస్తారు . సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు . ఎప్పటికప్పుడు నూతన పంథాలో అమాయకులను ఏమార్చి .. ప్రలోభ పెట్టి మాయ చేస్తున్నారు.
![మన బలహీనతే.. సైబర్ కేటుగాళ్ల పెట్టుబడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4716160-21-4716160-1570770925868.jpg)
cyber-crime-new-trick
మన బలహీనతపైనే.. సైబర్ కేటుగాళ్ల గురి
విజయవాడకు చెందిన రోజా అనే మహిళకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మహిమ కలిగిన పురాతన పంచలోహ విగ్రహాలు మీకు అతి తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికాడు. ఇటువంటి సైబర్ నేరాలపై అవగాహన ఉండటంతో నిందితుని మాటలు నమ్మలేదు.
అయితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ నగదు ఏమీ పోలేదు కదా అని పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . తాజాగా నేరస్తులు అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు .
Last Updated : Oct 11, 2019, 5:59 PM IST