ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా టీకా రిజిస్ట్రేషన్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు - vijayawada crime

కొవిడ్ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్న జనాల అవసరాన్ని సైబర్ నేరగాళ్లు తమ స్వార్థానికి వాడేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పేరిట వేల రూపాయలు గుంజేస్తున్నారు. ఈ తరహా నేరాలు ఎక్కువయ్యాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు కోరుతున్నారు.

cyber cheating with corona vaccine registration in vijayawada
కరోనా టీకా రిజిస్ట్రేషన్ పేరిట సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసాలు

By

Published : Jun 9, 2021, 2:46 AM IST

కరోనా టీకా కోసం ప్రజలు ఎగబడుతున్న తీరు చూసి కొందరు సైబర్ కిలాడీలు రెచ్చిపోతున్నారు. వ్యాక్సిన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయాలని, పలానా నంబర్‌కు ఫోన్ చేయాలని ఫేస్​బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్‌ రూపంలో ఉంచుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆన్‌లైన్ యాప్‌లో టీకా రిజిస్ట్రేషన్ కోసం కనీసం 1500 నుంచి వేలల్లో దోచేస్తున్నారని గుర్తించారు. మోసపోయామంటూ విజయవాడలో ఇటీవలే ఇద్దరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు తెలిసినవాళ్ల పేర్ల మీద నకిలీ ఖాతాలు సృష్టించి చికిత్స కోసమంటూ డబ్బు లాగేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ తరహాలో ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రంగా ఈ నేరాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details