పట్టణాలు, నగరాల్లో రహదార్లు, డ్రెయిన్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోయిన యజమానులకు పరిహారంగా నగదు బదులు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారు. ప్రారంభంలో ఎఫ్‌ఎఆర్ బాండ్లు జారీచేయగా, ఆపై మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ రెవెన్యూ విలువలో 1:4 నిష్పత్తి చొప్పున వీటి జారీ ప్రక్రియ సాగుతోంది.
ఉపయోగమిలా...
విజయవాడలో 2002 నుంచి ఇటీవల వరకు అనేక రహదార్లు విస్తరించారు. పలు డ్రెయిన్లు వెడల్పు చేశారు. అందుకు ప్రైవేటు యజమానుల నుంచి స్థలాలు, భవనాలు సేకరించి ప్రత్యామ్నాయంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. వీటిని అదనపు అంతస్తుల నిర్మాణాలకు, అనధికారిక లేఅవుట్‌లలో 14 శాతం ఖాళీస్థలం ఫీజులు, ఇతర ఫీజుల కింద ఉపయోగించుకునే వీలుంది. నగరంలో ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల విలువైన 2400 టీడీఆర్ బాండ్లు జారీ అయ్యాయి. అందులో రూ.150 కోట్ల విలువైన బాండ్లను ఆయా భవన యజమానులు ఫీజులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఏడాదిలోనే ఆ విలువ రూ.70 కోట్ల వరకు ఉంది. వాస్తవానికి టీడీఆర్ బాండ్ల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 30 నుంచి 32 శాతం మాత్రమే ఉంది. అయితే 1:4 నిష్పత్తిలో జారీచేయడం వల్ల యజమానులు.. ఇతరులకు అంత మొత్తానికి అమ్ముకున్నా, ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. కొనుగోలు చేసిన బహుళ అంతస్తుల నిర్మాణదార్లకు భారీగా లాభం చేకూరుతుంది.
ప్రభుత్వానికి ప్రతిపాదన
స్థానిక సంస్థలకు భవన నిర్మాణ ఫీజుల కింద రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతుందనే ఆలోచనకు వచ్చిన అధికారులు, బాండ్ల బహుళ ప్రయోజనాల విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా ఇకపై అదనపు ఫోర్ల నిర్మాణాలకు మినహా, ఫీజులకు ప్రత్యామ్నాయంగా బాండ్లను ఉపయోగించకుండా ప్రతిపాదనలు పంపారు. త్వరలో దీనిపై ఉత్తర్వులు జారీకానున్నట్లు చెబుతున్నారు. టీడీఆర్ బాండ్ల విలువలు పెరుగుతాయని, వాటిని భద్రపర్చుకోవాలని అధికారులు చెప్పడంతో అనేక మంది రూ.లక్షల విలువైన బాండ్లను తమ వద్దే ఉంచుకున్నారు.
బాండ్ల వినియోగం లేకుండా ప్రతిపాదించినవి
* బిల్డింగ్ లైసెన్సు ఫీజులు
* అడిషనల్ బిల్డింగ్ లైసెన్సు ఫీజులు